Pavan Yara

Telugu Quotes - 1

Collected via an internet posting (comp.lang.culture.telugu??):

కన్ను నీదని, వేలు నీదని పొడుచుకుంటె రాదా రక్తం ?

                                                – ఆత్రేయ

కమలాసతి ముఖ కమల, కమల హిత, కమలేక్షణ, కమల ప్రియా

కమలాసన హిత, గరుడ గమన, శ్రీ కమల నాభ, నీ పద కమలమే శరణు

                                                – పద-కమలాలతో

                                                  అన్నమాచార్య అర్చన

ధనువో

జనకుని మనమున భయమో

ధారుణి కన్యా సంశయమో

దనుజులు కల గను సుఖ గోపురమో

విరిగెను మిథిలా నగరానా

                                        – విరిగింది, ధనువొక్కటే కాదట

                                        ఇవ్వన్నీ కూడా అంటున్న సీ. సముద్రాల

ఫెళ్ళు మనె విల్లు గంటలు గల్లుమనె, గు-

భిల్లుమనె గుండె నృపులకు, ఝల్లు మనియె

జానకి దేహమున్, నిమేషంబునందె

నయము, జయము, విస్మయము గదురా !

                                  – కరుణ శ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి

క్షణమే దినమై, నిరీక్షణమే యుగమై

తరుణి వంక శివధనువు వంక

తమ తనువు మరచి కనులు తెరచి చూడగ .. రామా కనవేమిరా

                         – సి.నా.రే.

వాని జూచి మగవారలైన

  మై మరచి పోయి

    మరుల్ గొనెడు

      మరోమరుడు 

        మనోహరుడు

        … రఘురాముడు …

                          – శ్రీశ్రీ (!)

భాగవత రామాయన గీతాది శృతి శాస్త్ర పురాణపు మర్మములన్, శివాది

షణ్మతముల గూఢములన్, ముప్పది ముక్కోటి సురాంతరంగముల భావంబుల

నెరిగి, భావ రాగ లయాది సౌఖ్యముచే చిరాయువుల్ గలిగి, నిరవధి

సుఖాత్ములై త్యాగరజాప్తులైన వారెందరో మహానుభావులు.

                                                – సైంత్ త్యాగరాజ

తెర తీయగ రాదా … నాలోని మద మత్సరమను తెర తీయగ రాదా ?

                                        – త్యాగరాజ అస్కింగ్

                                ‘విల్ల్ యౌ నొత్ రెమొవె థె చుర్తైన్

                                ఒఫ్ వనిత్య్ అంద్ జేలౌస్య్ ఇన్ మె(మ్య్ మింద్)’

దార సుతులు ధన ధాన్యములుందిన

సారెకు జప తప సంపద గల్గిన

శాంతమూ లేక సౌఖ్యము లేదు, సారసా దళ నయన

దాంతుని కైన, వేదాంతునికైన

                                                – సైంత్ త్యాగరాజ

సంతసంబు శ్రీకాంత స్వాంత సి-

ద్ధాంతమైన మార్గచింత లేని వా-

రెంత నేర్చిన, ఎంత చూసినా ఎంత వరలైనా కాంత దాసులే

                                                – సైంత్ త్యాగరాజ

హరిగుణ మణిమయ సరములు గళమున శోభిల్లు

భక్త కోటులిలలో చెలిమితో, తెలివితో కరుణ గల్గి

జగమెల్లను సుధా దృష్తితో బ్రోచువారెందరో మహానుభావులు

                                                – సైంత్ త్యాగరాజ

నీ మేను నామ వైభవంబు,  నీ పరాక్రమ ధైర్యముల శాంత మానసములన్

ఈవు లను వచన సత్యమును, రఘువర, నీ యెడ సత్భక్తియు జనింపగను

దుర్మతములను కల్ల చేసి నట్టి నీ మది నెరింగి సంతతంబు గుణ

వజనానద కీర్తనము చేయు వారెందరో మహానుభవులు.

                                                – సైంత్ త్యాగరాజ

శివ మంత్రమునకు ‘మా’ జీవము

మాధవ మంత్రమునకు ‘రా’ జీవము

                                – త్యాగరాజ ఎక్ష్ప్లైనింగ్ థె వివరము ఒఫ్

                                        ‘రామా మంత్ర

నిగమ శిరోర్థము గల్గిన నిజ వాక్కులతో, స్వర శుధ్ధముతో

సొగసు గా మృదంగ తాళము జత గూర్చి నిను సొక్క జేయు ధీరుడెవ్వడొ ?

                                                – సైంత్ త్యాగరాజ

న్యాయాన్యాయము తెలియును – జగములు

మాయ మయమని తెలియును – దుర్జన

కాయజాది షద్రిపుల జయించే

కార్యము తెలియును త్యాగరాజునికే

                                                – సైంత్ త్యాగరాజ

Q: స్తుతమతి యైన య్’ంధ్ర కవి ధూర్జటి పల్కుల కేల కల్గె నీ

   యతులిత మాధురీ మహిమ?

ఆ:                            హా ! తెలిసెన్, భువనైక మోహనో

   ద్-ధత సుకుమార వార వనితా జనతా ఘనతాప హార సన్-

   తత మధురాధరోదిత సుధా రస ధారల గ్రోలుంటన్ జుమీ!

                                                – తెనాలి రామకృష్ణ కవి

చక్కని ముఖకమలంబును సదా నా మదిలో స్మరణ లేక

నే దుర్మదాంధ జనుల చేరి పరితాపములచే తగిలి నొగిలి

దుర్విషయ దురాశలను రోయ లెక సతత మపరాధియై

చపల చిత్తుడైన నన్నె … బ్రోచునా  ?

                                                – సైంత్ త్యాగరాజ

సతులకై కొన్నాళ్ళు ఆస్తికై,

సుతులకై కొన్నాళ్ళు ధన తతులకై

తిరిగితినయ్య త్యాగరాజ నుతా ! ఇటువంతి నన్నే … బ్రోతువా ?

                                                – సైంత్ త్యాగరాజ

మానవతను దుర్లభమనుచునెంచి పరమానంద మంద లేక

మద మత్సర కామ క్రోధ లొభములకున్ దాసుదై మోస పోతి గాక

ఇటువంతి నన్నె … బ్రోచునా  ?

                                                – సైంత్ త్యాగరాజ

మొదటి కులజుడగుచు భువిని శూద్రుల పనులు సలుపుచు నుంటి గాక

నరాధములను చేరి సార హీన మతములను సధింప  తాను మారు

ఇటువంతి నన్నె … బ్రోచునా  ?

                                                – సైంత్ త్యాగరాజ

నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నే నెగిరి పోతే నిబిడాశ్చర్యంతో వీరు !

నెత్తురు  కక్కుకుంటూ  నేలకు నే రాలి   పోతే నిర్దాక్షిణ్యంగా  వీరే  !!

                                                     — శ్రీశ్రీ

వచ్చిన రామాయణాలనే మళ్ళి మళ్ళి మ్రుచ్చలించి తెచ్చే కన్నా

ఆ మోస్తరు రచనల్లో క్షేమం కద రామ కోటి, సిరి సిరి మువ్వ

                                             – శ్రీశ్రీ

                          (థిస్ షౌల్ద్ బె కందం, బుత్ ఈ’ం మిస్సింగ్ సొమె వొర్ద్స్)

మరల నిదేల రామయణమన్నచో

        నీ ప్రపంచమెల్ల నెల్ల వేళ

దినుచున్న యన్నమే తినుచున్న దిన్నాళ్ళు

        తన రుచి బ్రతుకులు తనవి గాన

చేసిన సంసారమే చేయుచున్నది

        తనదైన యనుభూతి తనది గాన

తలచిన రామునే తలచెద నేనును

        నా భక్తి రచనలు నావి గాన

                                                — విశ్వనాథ

మా రేడు నీవని ఏరేరి తేనా మారేడు దళములు నీ పూజకు

                                             – వేటూరి

యమున ఎందుకె నీవు ఇంతా నలుపెక్కినావు ?

రేయి కిట్టయ్య తోని కూడావా ?

                                           – వేటూరి (?)

వయస్సు లో వృధ్ధ శవాని

జ్ఞనం లో శైశవాని

                                           –  యండమూరి వీరేంద్రనాథ్

నాలగు కాగితాలున్న చిన్న పుస్తకం

గాలికి రెప రెప లాడుతూ విర్రవీగుతుంది

సర్వస్వాని తన లో ఇముడ్చుకొన్న

మహోత్గ్రంథం నమ్రతగా ఒత్తిగిలి ఉంటుంది

                                           –  యండమూరి వీరేంద్రనాథ్

అనుభవం అంటే టెంకిజెల్లలు, మొట్టికాయలు తినడం –బుడుగు

మీ ఆయన, చచ్చిపోయాడు కాబట్టి బతికి పోయాడు కాని,

            బతికుంటేనా చచ్చుండేవాడు

                                                   – ???

మూడే ముళ్ళు, ఏడే అడుగులు

మొత్తం కలిపి నూరేళ్ళు

                                        –      మూడూ మాటళ్ళో పెళ్ళికి

                                                ఆత్రేయ నిర్వచనం

మనసు లేని దేవుడు

మనిషికెందుకో మనసిచ్చాడు

                                        — మన సుకవి, మనసు కవి ఆత్రేయ

గల గలమని నవ్వకే సొగసు కరిగి పోతుంది

… నా కొంగు పట్టి లాగకు, వలపు ఒలికి పోతుంది

                                        — కోపల్లె శివరాం

నదిలా నువు నదిచినంత మేర, భూదేవికి  ఆకుపచ్చ చీర

                                        — కోపల్లె శివరాం

ఏటి ఒడ్డున కూర్చుంటె, ఏరు గలగల మంటుంటె

ఏటి లోన మన నీడలు రెండు పెనవేసుకు పోతుంటె

ఓయమ్మో, ఓయమ్మో, ఈ జానెడు దూరం ఓపలేక పోతున్నాను

                                        — ఆత్రేయ

అమ్మ వంటిది, అంత మంచిది, అమ్మ ఒక్కటే

                                        – ఆత్రేయ

తీపి రాగాల కోకిలమ్మకు నల్లరంగులలమిన వాడి నేది కోరేది

కరకు గర్జనల మేఘముల మేనికి మెరుపు హంగు కూర్చిన వాడినేది ఆడిగేది

                                        – ‘నిందా స్తుతీ ఒఫ్ సిరివెన్నెల

సరిగమ పదనిని నీ దానిని

సరిగా సాగని సరి దారిని

దాగని నిగ నిగ ధగధగమని

..  దా మరి మానిని సరి దారిని

                                – సప్త స్వరాలతో జొన్నావిత్తుల మాటల గారడి

సరి గాని దారి మారి, గదా ధారి, నీ నిగ నిగ గని,

నీ మగని సామ నిగమ గరిమ గని, నీ పాద దరి ని

పరి పరి మురళీ రవళిమ్మని సదా కోరితి నమ్మ

                – ‘మా మానిని, నీ ధామ గని నీ దాసరిని గాదా’ అంటూ

        స్వరాక్షరాలలో Dr. బాల మురళి కృష్ణ చూపిన వైచిత్రి ప్రియత్వం

కొమ్మల గువ్వలు గుసగుసమనిన

రెమ్మల గాలులు ఉసురుసురనిన

అలలు   కొలనులొ గలగలమనిన

దవ్వుల వెనువు సవ్వది వినిన

నీవు వచ్చెవని నీ పిలుపె విని

కన్నుల నీరిది కలయజూచితి

                                – కృష్ణ శాస్త్రి

అసలే ఆనదు చూపు, ఆపై ఈ కన్నీరు,

తీరా దయ చేసిన నీ రూపు సోకదయ్యయో

                                – దెస్చ్రిబింగ్ శబరి ఫిందింగ్ రామా

                                        ఇంఫ్రొంత్ ఒఫ్ హెర్ – కృష్ణ శాస్త్రి

ఈ గంగ కెంత దిగులు, ఈ గాలికెంత గుబులు – కదలదయా రామా  ??? నావ

                                – కృష్ణ శాస్త్రి అబౌత్ గుహుడు

విరజాజి శిల పైన రాలేందుకే

మరు మల్లె కెంధూళి కలిసేందుకే

మన్సైన చినదాని మనసిందుకే - రగిలేందుకే

                                        – మల్లాది రామకృష్ణ శాస్త్రి

ఒకరి కిస్తే మరలి రాదు, ఓడిపోతే మరచి పోదు

గాయమైతే మాసిపోదు,  పగిలి పోతే అతుకు పడదు

                                        – `మనసు గతి ఇంతే’ అంటున్న

                                         మన-సుకవి ఆత్రేయ

బ్రాంది, విస్కి, జిన్ను, రమ్ము రకరకాల మధువులు

భార్యా భర్తలు, తల్లి పిల్లలు పలు రకాల బంధాలు

ఏదైనా నిషా తగ్గే వరకే, ఎవరైనా ఋణం తీరే వరకే

ఆపై మిగిలేదేముంది, ఖాలి సీసాలు, కాలిన బూడిదలు

                                         — ఆత్రేయ

పచ్చని చేలా పావడ గట్టి

కొండ మల్లెలే కొప్పున బెట్టి

…  కిన్నెర సాని వచ్చిందమ్మ వెన్నెల పైటేసి

                                                — వేటూరి

మావి చిగురు తినగానే కోవిల పలికేనా ?

కోవిల గొంతు వినగానే మావి చిగురు తొడిగేనా ?

                                                — కృష్ణ శాస్త్రి‘స్ దిలెమ్మ

గౌతమీ జలాల్లో కొన్ని వేల విద్యుద్దీపలు

ఎవరు ఈవిడ దమ్మిల్లంలో, ఇన్ని వేల కాంతి లతాంతాలను తురిమారు ?

                                                – కృష్ణ శాస్త్రి ఒర్ తిలక్ ?

ఆకాశాన ఆ మణి దీపాలే  ముత్తైదువులుంచారో,

ఈ కోనేట ఈ చిరు దివ్వెల చూసి చుక్కలనుకొంటారు

                                                – కృష్ణ శాస్త్రి

ఎవరే, ఆర వేసేరమ్మా,               

ఏటి ఇసుకపై వెండి చీరలూ         

ఎవరే, ఓరగ విసిరేరమ్మా,         

ఏటి అలలపై వెలుగుల వలలూ

                                         – భుజంగరాయ శర్మ దెపిచ్తింగ్

                                   థె మూన్లిఘ్త్ ఒన్ థె వవెస్ ఒఫ్ థె బ్రూక్!

అంత కడివెడు పాలపై ఒ-

కింత మీగడ పేరినట్లుగ

మనకు మిగులును, గతము లోని

మంచి, అదియే సంప్రదాయము

                                        – సి.నా.రె. దృష్టిలో సంప్రదాయం

సేవలందున దాసిగా భావమెరిగిన మంత్రిగా

వలపులందున రంభగా వనిత మెలగాలి

                                        — చన్ వె అస్సుమె థిస్ అస్ ఆరుద్ర‘స్

                                        తెలుగు సేత ఫొర్ ‘కార్యేషు దాసీ

రాతిరి రాతిరి వస్తానన్నావు, మావ రాతి గంధం తీసి ఉంచాను

గంధమలా ఎండి పోయింది, నువు రాక అందమిల ఉండి పోయింది

                                        – ఆత్రేయ (బసెద్ ఒన్ ఫొల్క్ సొంగ్)

కొమ్మ కొమ్మకు చిగుళ్ళాయె

గుండె నిండా గుబుల్లాయె

పువ్వు పువ్వున తుమ్మెదాయె

పొంగు వయసుతో పోరులాయె

                                — ఆత్రేయ (బసెద్ ఒన్ ఫొల్క్ సొంగ్)

తెలిసీ వలచి విలపించుటలో, తీయదనం ఎవరికి తెలుసు

                                — ఆత్రేయ

నీ దోవ పొడవునా కువకువల స్వాగతం

నీ కాలి అలికిడి కే మెలకువల వందనం

నీ చరన కిరణాలు పలుకరించితే చాలు

పల్లవించును ప్రభు పవలించు భువనాలు

                                — సీతా రామ శాస్త్రి వెల్చొమింగ్ ‘ంర్. శుణ్

చాకిరొకరిది, సౌఖ్యమొకరిదా ?  సాగదింకా తెలుసుకో

                                                        – ఆత్రేయ

ఏ  దేశ సంస్కృతి అయినా ఏనాడు కాదొక స్థిర బిందువు

నైక  నదీ నదాలు కలిసిన అంతస్సింధువు

                                                        — తిలక్

అస్థిముల పంజరాలు, ఆర్తరావ మందిరాలు

ఏఎ లొకం తల్లి ! ఈట కనిపించడు కాలనేమి

                                                 — తిలక్

పువ్వని పిలువాలంటె ఆ సొగసు ఒక్క దినం

మెరుపని పిలువాలంటె ఆ వెలుగు ఒక్క క్షణం

                        – రాజ శ్రీ త్రన్స్లతింగ్ థె హింది వెర్సెస్

                        తుజె సూరజ్ సంఝెతో, ఇసీమె ఆగ్ హై

                        తుజె మై చాంద్ సంఝెతో, ఇసీమె దాగ్ హై

వెలుగు దుస్తులేసుకొని సూరీడు

తూర్పు తలుపు తోసుకొని వచ్చాడు

పాడు చీకటికెంత భయమేసిందో

పక్క దులుపుకొని ఒకే పరుగు తీసింది

                                        — మల్లె మాల

కవితా సతి నొసట నిత్య నూతన రస గంగాధర తిలకం.

                                        – శ్రీశ్రీ అబౌత్ ‘తిలక్’

ఇతని శైలి శైలూషి – నిత్య(?) ప్రజా శ్రేయోభిలాషి

                                        – తిలక్ అబౌత్ ‘శ్రీశ్రీ’

ఒక స్వప్నం, ఒక బాష్పం మెదిగిన సుగంధ ద్రవ్యం

                                        – తిలక్ అబౌత్ ‘కృష్ణ శాస్త్రీ

విస్వనాథ వైశ్వానర కీరార్చికి

వాగీశ్వరి సగం మెరిసె, సగం వడలె

                                – తిలక్ అబౌత్ ‘విశ్వనాథ సత్యనారాయనా

మన వాడే, మహా గట్టి వాడు,

మకుటం లేని మహరజయ్యే వాడు, కాని

ముసలి దాన్ని, మసక మసక కన్నుల దాన్ని,

మూల మూల ముడుచుక కూర్చున్న దాన్ని,

మనువు చేసుకోవాలన్న ఉబలాటం తో

మంచి, చేడ్డ మరచి పోయాడు, మర్యాదలను అతిక్రమించాడు

                        – తిలక్ అబౌత్  విశ్వనాథ సత్యనారయన

మల్లెపూల మీద పరుంటాడు, మంచి గంధం రాసుకుంటాడు, మరెందుకేడుస్తాడు ?

                        – తిలక్ అబౌత్ కృష్ణ శాస్త్రి

షేక్ స్పియర్, డాంటి, కాళిదాసూ,  శంకరుడు

మార్క్సూ, మహాత్ముడు, పికాసో, సార్తే

ఎవరైనా ఇది నిరంతర నూతన పరిశోధన

సత్య సౌందర్యాన్వేషణ – ఒక శికరారోహణ

                                                – తిలక్

న అక్షరలు కన్నీతి ఝరులలో తడిసే దయాపరవతలు

న అక్షరలు ప్రజా శక్తులు వహించే(?) విజయ ఐరావతలు

న అక్షరలు వెన్నల్లలొ ఆడుకునే అందమైన ఆడపిల్లలు

                                                – తిలక్

కవిత్వం అంతరాంతర జ్యోతిస్సీమల్ని బహిర్గతం చేయ్యాలి

విస్తరించాలి చైతన్య పరిధి  – అగ్ని జల్లినా, అమృతం

కురిచినా, అందం, ఆనందం దాని పరమావధి

                                                – తిలక్

మంచు తాకి కోయిల మౌనమైన వేలల

ఆమని పాడవే హాయిగా, …

రాలేటి పూల రాగాల తో, పూసేటి పూల గంధలతో …

                                                        – వేటూరి

ఎడారిలొ కోయిల,

తెల్లరనీ రేయిలా …

పూదారులన్ని గోదారికాగ,

పాడింది కన్నీటి పాట.

                                                        – వేటూరి

(ఫరుచురి శ్రినివస్ అద్దెద్ థెసె qఉఒతెస్ ఒఫ్ ముల్లపూడీస్ చిచ్చర పిడుగు - బుడుగు)

శిక్ష అంటే చిన్న పిల్లల్ని బళ్ళో పెట్టెయ్యడం అన్నమాట.

                                                    – బుడుగు

ధైర్యం అంటే పోలీసుతోనూ సుబ్బలష్మితోనూ మాట్లాడాం అని అర్థం – బుడుగు

అభద్దాలు చెప్తే ఆడపిల్లలు పుట్తార్ట. నీకు తెలుసా? నాకు తెలుసుటలే.

నిజం చెప్తే మొగపిల్లలు పుట్తార్ట. చాలా ఎక్కువ నిజం చెప్తే నాలాంటి పెంకి

భడవలు పుట్తార్ట. – బుడుగు

పుట్తార్టడం అంటే, మనం ఎక్కడో దొరకడం అన్నమాట.  అంటే దేవుడు మన్ని

తెచ్చి మా యింటో పడేస్తాడు.         – బుడుగు

ఖాతరు చెయ్యను అనడం అంటే ససి, వాళ్ళ ముగుడితో రైలు దిగివెళ్ళిపోవడం

అన్నమాటా                                        – బుడుగు

పెళ్ళాడుతావురా అంటే నాకు తెలీదు. కాని, మరి నేను చిన్నవాడినీ చితకవాడినీ

కానుగా అందుకని నాకు అన్నీ తెలుసుగా.                – బుడుగు

అష్చరాబాసం ఏం కష్టం కాదులే. అన్నీ మనకి వచ్చినవే మళ్ళీ అనమంటారు.

ఓ నా మ హా సీ వా య హా సీ ధం నా మ హా ఇలాంటివి. అదంతా బావుంటుందిలే.

                                                    – బుడుగు

ఇప్పుడు కొన్ని కార్లున్నాయనుకో అవి ముందర వేపూ వెనకాతలవేపూ ఒక్కలాఘే

ఉంటాయి. అందుకని దూరమ్నుంచి చూస్తే అలాటి కార్లు ఇటు వస్తున్నాయో అటు

పోతున్నాయో గబుక్కున తెలీదు. ఈ జడలమ్మాయీ అంతే. రెండు జడలు కదూ. ఓటి

ముందరికీ ఓటి వెనక్కీ వేసుకొంటుంది. అందుకని కొస్తుందో పోతుందో తెలీదు

దూరానికి.                                             – బుడుగు

సంకురాతిరి అంటే సుబ్బలస్చిమి, సూరీడు, సావిత్తిరి, వాళ్ళందరూ పొద్దున్నేనూ,

సాయింతరమూనూ ముగ్గులు వెయ్యడం అని అర్థంట, గొబ్బిళ్ళు పెట్టి డానుసు

చెయ్యడంట.                                            –బుడుగు

తెలుగదేలయన్న దేశంబు తెలుగేను

తెలుగునాయకుండ, దెలుగొ కండ;

ఎల్ల బాసలందు నెరుగవే బాసాది

దేశభాషలందు దెలుగు లెస్స.

                                     – శ్రీకృష్ణధేవరాయలు

పూజారి వారి కోడలు

తా జారగ బిండె జారి దబ్బున బడియెన్

మై జారు కొంగు తడిసిన

బాజారే తిరిగి చూసి ఫక్కున నవ్వెన్

                                – శ్రీనాథ

ఖగపతి అమృతము తేగా

భుగభుగ మని పొంగి చుక్క భూమిని రాలెన్

పొగ చెత్తై జన్మించెను

పొగ తాగని వాడు దున్నపోతై పుట్టున్      -గిరీశం, ఇన్ కన్యాశుల్కం

అక్షయ్యంబుగ సాంపరాయని తెలుంగాధీశ, కస్తూరికా

భిక్షాదానము సేయరా, సుకవిరాడ్బ్రుందారక శ్రేణికిన్,

దాక్షారామ చళుక్య భీమవర గంధర్వాపసరోభామినీ

వక్షోజద్వయ కుంభి కుంభములపై వాసించు తద్వాసనల్

                                                – శ్రీనాథ

భరత ఖండమ్ము చక్కని పాడియావు

హిందువులు లేగ దూడలై ఏద్చుచుండ

తెల్లవారను గదుసు గొల్ల వారు

పితుకు చున్నారు మూతులు బిగపట్టి

                                 – చిలకమర్తి

తాలిదవరిగె విరోధ లోక దలుంటె

గాలిగె గిరియు అల్లాడ బల్లదే! రంగా !!

(విల్ల్ థె పతిఎంత్ పెర్సొన్ హవె అన్య్ ఎనెమిఎస్ ఇన్ థిస్ వొర్ల్ద్ ?

ఛన్ అ ఫిర్మ్ మౌంతైన్ బె మొవెద్ బ్య్ ఐర్ ? ).

                                                         పురందర దాస

మెర్సిడెస్సులు బెంజులెక్కిన మహరాజు

        మారుతి కారులో పోవుటెట్లు?

విగత సోడా స్కాచి సేవించు సోగ్గాడు

        కల్లు దుకాణాల కరుగు టెట్లు?

మెత్తని టిష్యూల మెరగిన దొరబాబు

        చెంబుతో చెరువుకు పోవుటెట్లు?

బ్లాండు కన్నియ బాహు బంధంబు విడద్రోచి

        ఒంటిగా నింట నిద్రించు టెట్లు?


అమెరికాలోని జిలుగు వెలుగుల జూసి

హంగు, పొంగులు, రంగుల నన్ని గాంచి

భరత దేశాని కే రీతి పోవ నేంచు?

డాలరుండగ రూకల కోరు నెవడు?

                             – నాగ గొల్లకోట & రామకృష్ణ పిల్లలమఱ్ఱి

మరపు రాని బాధ కన్నా మధురమైనది లేదు

గతము తలచి వగచే కన్నా సౌఖ్యమే లేదు

అందరాని పొందు కన్నా అందమే లేదు, ఆనందమే లేదు

                                                – సీ. సముద్రాల

తల్లీ, నిన్ను దలంచి పుస్తకము చేతంబూనితిన్, నీవు నా

యుల్లంబందున నిల్చి జృంభణముగా నూక్తులు, సుశబ్దంబు శో

భిల్లన్ జేయుము నాదు వాక్కునను సంప్రీతిన్ జగన్మోహినీ,

ఫుల్లాబ్జాక్షి, సరస్వతీ, భగవతీ, పూర్ణేందుబింబాననా

                                                – ??

కరకు బోయడే అంతరించగా,

కవిగా ఆతడు అవతరించగా

నవ రస  భరితం రాముని చరితం

జగతికి ఆతడు పంచిన అమృతం

                                        – వేటూరి

భావ రాగ లయాది సౌఖ్యముచే చిరాయువుల్ గలిగి నిరవధి సుఖాత్ములై

త్యాగరాజాప్తులైన వరెందరో  మహానుభావు, అందరికి వందనములు.

                                                — సైంత్ త్యాగరాజ

#quotes #telugu

Keep reading