Eppudu Oppukovaddhura Otami: Telugu Song!!
Written by Sirivennala Sitarama Sastry
ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి
ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి విశ్రమించవద్దు ఏ క్షణం విస్మరించవద్దు నిర్ణయం అప్పుడే నీ జయం నిశ్చయం రా || ఎప్పుడూ||
నింగి ఎంత పెద్దదైన రివ్వుమన్న గువ్వ పిల్ల రెక్క ముందు తక్కువేనురా సంద్రమెంత గొప్పదైన ఈదుతున్న చేపపిల్ల ముప్పు ముందు చిన్నదేనురా పశ్చిమాన పొంచి వుండి రవిని మింగు అసుర సంధ్య ఒక్కనాడు నెగ్గలేదురా గుటకపడని అగ్గిఉండ సాగరాన ఈదుకుంటూ తూరుపింట తేలుతుందిరానిషా విలాసమెంతసేపురా ఉషోదయాన్ని ఎవ్వరపురా ???రగులుతున్న గుండెకూడా సూర్యగోల మంటి దేనురా || ఎప్పుడూ||
నొప్పిలేని నిమిషమేది జననమైనా మరణమైనా జీవితాన అడుగు అడుగునా నీరసించి నిలిచిపోతే నిమిషమైన నీది కాదు బ్రతుకు అంటే నిత్య ఘర్షణ దేహ ముంది ప్రాణ ముంది నెత్తురుంది సత్తువుంది ఇంతకన్నా సైన్యముండునా ???ఆశ నీకు అస్త్రమౌను శ్వాస నీకు శాస్త్రమౌను ఆశయమ్ము సారధౌనురా నిరంతరం ప్రయత్నమున్నదా నిరాశకే నిరాశ పుట్టదా ???ఆయువంటు వున్నవరకు చావుకూడా నెగ్గలేక శవముపైనే గెలుపు చాటురా || ఎప్పుడూ||