Pavan Yara

ప్రతిజ్ఞ

పొలాల నన్నీ ,
హలాల దున్నీ,
ఇలాతలంలో హేమం పిండగ-
జగానికంతా సౌఖ్యం నిండగ-
విరామ మెరుగక పరిశ్రమించే,
బలం ధరిత్రికి బలి కావించే,
కర్షక వీరుల కాయం నిండా
కాలువకట్టే ఘర్మజలానికి,
ఘర్మజలానికి,
ధర్మజలానికి,
ఘర్మజలానికి ఖరీదు లేదోయ్!

నరాల బిగువూ,
కరాల సత్తువ
వరాల వర్షం కురిపించాలని,
ప్రపంచ భాగ్యం వర్ధిల్లాలని-
గనిలో, పనిలో, కార్ఖానాలో
పరిక్లమిస్తూ,
పరిప్లవిస్తూ
ధనికస్వామికి దాస్యంచేసే,
యంత్రభూతముల కోరలు తోమే,
కార్మిక వీరుల కన్నుల నిండా
కణ కణ మండే,
గలగల తొణికే
విలాపాగ్నులకు, విషాదాశ్రులకు
ఖరీదుకట్టే షరాబు లేడోయ్!

[[found via http://srisrikavitalu.blogspot.com/ ]]

#poem #శ్రీశ్రీ

Keep reading